VZM: విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్. రఘురాజు పై మండలి ఛైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటును హైకోర్టు బుధవారం రద్దు చేసింది. అనర్హత వేటు పై గతంలోనే హైకోర్టును ఇందుకూరి రఘురాజు ఆశ్రయించారు. బుధవారం తుది విచారణ నిర్వహించారు. విచారణ అనంతరం 2027 నవంబర్ 31 వరకు ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు కొనసాగనున్నారని తెలిపారు.