BPT: ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బాపట్లలోని ఆ పార్టీ కార్యాలయంలో నాయకుడు జేబీ శ్రీధర్ మాట్లాడుతూ.. అధికారం కోసం కూటమి ప్రభుత్వం అమలు సాధ్యం కాని హామీలను ప్రకటించిందన్నారు. అధికారం చేపట్టి నాలుగు నెలలు గడిచినా ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి అమలు చేయలేదని మండిపడ్డారు.