తూ.గో: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. శుక్రవారం జగ్గంపేటలో జరిగిన కార్యక్రమంలో నెహ్రూ మాట్లాడుతూ.. ఉచితమని చెప్పి ముందు గ్యాస్ సిలిండర్‌కు డబ్బులు కట్టించుకుని తర్వాత ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. దీనిపై సీఎంతో మాట్లాడి ఉచిత పంపిణీపై చర్యలు తీసుకుంటామన్నారు.