SKLM: శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ (పురుషులు) కళాశాలలో ఈనెల 29వ తేదీన యోగాసన పోటీలను నిర్వహిస్తున్నట్లు నేషనల్ యోగాసనం స్పోర్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం తెలిపారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేందుకు యోగా ఎంతో అవసరమన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు గమనించాలన్నారు.