GNTR: కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఓబులేసు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనకై మంగళగిరిలో సోమవారం ఎన్నారై వై జంక్షన్ వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఏపీ ఆశ వర్కర్ల యూనియన్ నేతలు పాల్గొన్నారు.