KRNL: కర్నూలులోని పలు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ తెలిపారు. గురువారం గౌలిగేరి 129వ సచివాలయంలో ఆధార్ క్యాంపును అదనపు కమిషనర్, మేనేజర్‌తో కలిసి పరిశీలించారు. శుక్రవారంతో ఆధార్ ప్రత్యేక క్యాంపులు ముగుస్తాయని, వాటి సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.