NDL: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.5కే టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. క్యాంటీన్‌కు వచ్చిన వారికి ఎమ్మెల్యే అల్పాహారం వడ్డించారు.