E.G: అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీరామ్ శ్రీధర్ కుటుంబ సభ్యులు రూ.17,551 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.