KRNL: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనీలో జరిగింది. ఆదోనిలోని అమరావతి నగర్లో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలోకి అనుమానం పెనుభూతమై వచ్చింది. భార్య పావనిపై భర్త శ్రీనివాసులు అనుమానం పెంచుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన పావని వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది.