BPT: ఎవరైనా అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ హెచ్చరించారు. కర్లపాలెంలోని ఎరువుల దుకాణాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎరువులను దుకాణాలు వద్ద ఎరువుల స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డు, బిల్ బుక్స్ ను తనిఖీ చేశారు. అనంతరం దుకాణదారులకు పలు సూచనలు చేశారు.