NTR: వ్యక్తిగత అవసరాల పేరుతో అక్రమ ఇసుక వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుకపై సీనరేజ్, జీఎస్టీ రద్దు చేసిందన్నారు. స్థానిక అవసరాలకు ఇసుక సేకరించేవారు స్థానిక అధికారులకు సమాచారం అందించిన తరువాత మాత్రమే తవ్వకాలు జరపాలన్నారు.