బాపట్ల: పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా మరింత అభివృద్ధి కానుందని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. 2024 సంవత్సరంలో “పర్యాటకం-శాంతి” అనే నినాదంతో వేడుకలు జరుగుతాయన్నారు.