»Shocking Abhishekam To Sai Baba With Beer Bottles
Viral: షాకింగ్..బీరుతో సాయిబాబాకు అభిషేకం!
భక్తులు కొత్త కొత్త సంప్రదాయాలను తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా కొందరు భక్తులు బాబాకు బీర్‌తో అభిషేకం చేశారు. ఈ ఘటనపై బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవునికి పాలు, తేనె, పంచదార, పండ్ల రసాలతో అభిషేకం చేయడం అందరం చూసుంటాం. అయితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా చేశారు. బీరు(Beer)తో సాయిబాబా (Sai Baba)కు అభిషేకం చేశారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు విరుద్ధంగా వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుపౌర్ణమి రోజున బాబాకు బీరు బాటిళ్లతో పాటు తేనె పాలను తీసుకొచ్చి అభిషేకం చేయడంపై బాబా భక్తులు ఫైర్ అవుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలోని కొంత మంది బాబా భక్తులు బీరు(Beer) బాటిళ్లను పూజ చేస్తుండగా తీసుకొచ్చారు. సాయి బాబా(Sai Baba) విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కొందరు బీరు సీసాలు, విస్కీ బాటిల్స్‌తో పూజలు చేశారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేకం చేయకుండా వారంతా ఆల్కాహాల్ బాటిల్స్ తోనే అభిషేకం చేశారు. వారు చేసిన పనికి అక్కడున్న ఇంకొందరు అవాక్కయ్యారు.
ఇటువంటి కొత్త రకం సంప్రదాయం ఏంటని బాబా(Sai Baba) భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాం చేయడం బాబాను అవమానించడమేనని మండిపడుతున్నారు. సాయిబాబాకు బీరు(Beer)తో అభిషేకం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.