అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు స్పందించి అంబులెన్స్ లో యువతిని హాస్పిటల్ కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించారు. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. సియాటిల్ లో ఉంటున్న కందుల జాహ్నవి.. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో థామస్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. జాహ్నవి మరణంతో ఆదోనిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.