Minister Ambati Rambabu: గత ప్రభుత్వం చేసిన తప్పులతో రూ.2 వేల పైచిలుకు కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. అప్పటి సీఎం చంద్రబాబుకు (chandrababu) ప్రచారం చేయడమే తప్ప మరొ పని ఉండేది కాదన్నారు. ఆయన చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని తెలిపారు. పోలవరం తొలి దశ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.12, 911 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. అదనంగా రూ.5127 కోట్లు రిలీజ్ చేయాలని కోరామని గుర్తుచేశారు. దీంతో పోలవరం తొలిదశ పనులు పూర్తి చేశామని వివరించారు.
నిధుల కొరత సమస్య సీఎం జగన్ చొరవతో తీరిందని అంబటి రాంబాబు (Ambati Rambabu) తెలిపారు. పోలవరం చూస్తామని టీడీపీ పబ్లిసిటీ స్టంట్ చేస్తోందని.. ఇదీ కేవలం ఆ పార్టీ ప్రచార యావేనని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ను నాశనం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు, దేవినేని ఉమ ఆలోచించకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కడుపు మంటతో ఎల్లో మీడియా అసత్య కథనాలు రాస్తోందని మండిపడ్డారు. పోలవరం స్పిల్ వే కంప్లీట్ చేసింది వైసీపీ ప్రభుత్వమేనని అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పష్టంచేశారు. గైడ్ బండ్ కుంగడాన్ని తీవ్రంగా పరిగణించడాన్ని తప్పుపట్టారు. గైడ్ బండ్ కుంగిన మాట వాస్తవమేనని.. దానిపై సీడబ్ల్యూసీ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. కానీ ఎల్లో మీడియా కడుపు మంటతో రాస్తోందని మండిపడ్డారు.
కుప్పం మున్సిపాలిటీ చేశావా..? రెవెన్యూ డివిజన్ చేయలేదు..? ఏ విధమైన అభివృద్ది చేయని మీరు.. తమ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని అంబటి రాంబాబు (Ambati Rambabu) అడిగారు. కడప, పులివెందుల అద్భుతంగా అభివృద్ది చేసిందని వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. పిల్లకాలువ తవ్వేందుకు మంత్రులం అని అంటారా అని చంద్రబాబుపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఆయన ప్రస్టేషన్లో ఉండి మాట్లాడుతున్నారని అర్థం అవుతోందన్నారు.