ATP: డీఎస్సీ, ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈనెల 10న ఎంపిక కోసం రాత పరీక్ష ఉంటుందని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఖుష్బు కొఠారి తెలిపారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి శిక్షణ ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.