Purandeswari: ఏపీలో పొత్తులపై క్లారిటీ లేదు. జనసేన- బీజేపీ కలిసి పోటీ చేయడం పక్కా.. టీడీపీ కూడా కలిసి వస్తోందని పవన్ కల్యాణ్ అంటున్నారు. దీంతో అలయన్స్‌పై స్పష్టత రావడం లేదు. గన్నవరంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) తదితరులు హాజరయ్యారు. పొత్తుల గురించి మీడియా ప్రతినిధులు అడగగా.. రాష్ట్ర నేతల అభిప్రాయాలను కేంద్ర నాయకత్వానికి వివరించామని తెలిపారు.
ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందని పురందేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారని వివరించారు. ప్రతిపాదన పంపడమే పని అని.. నిర్ణయం ఢిల్లీ పెద్దలు తీసుకుంటారని చెప్పారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.. చర్చలు జరగలేదా అని ఓ ప్రతినిధ అడగగా.. లోపల జరిగే చర్చలు మీకు చెబుతామా అని పురంధేశ్వరి అన్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆమె వివరించారు. బూత్, మండల స్థాయికి వెళ్లాలని.. ఇదే అంశం మీద డిస్కష్ చేశామని తెలిపారు.
జనసేన-బీజేపీతో టీడీపీ కలువాలని జనసేనాని పవన్ (Pawan) అంటున్నారు. మరీ బీజేపీలో కీలక స్థానంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వదిన పురంధేశ్వరి ఏమంటారో చూడాలీ. రాజకీయంగా వారికి పడనందున.. సానుకూలంగా చెప్పే అవకాశం ఉండదు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు అడగగా.. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. ఎన్నికలకు మరో ఏడాది వరకు సమయం ఉండటంతో ఏం జరుగుతుందో చూడాలీ.