కడప: ఉమ్మడి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఉద్యోగ నియామకానికి సంబంధించి పీఈటీ, పీఎంటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ పలు సూచనలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30నుంచి జనవరి 8 వరకు జరిగే రిక్రూట్మెంట్ పరీక్షలకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు 2సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.