NDL: బనగానపల్లె మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఆలయ అభివృద్ధికి విజయవాడకు చెందిన జి. శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు రూ.10116లు విరాళం అందచేసినట్లు ఆలయ ఈఓ పాండురంగా రెడ్డి, చైర్మన్ బండి మౌలీశ్వర్ రెడ్డి తెలిపారు. దాతకు ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందచేసినట్లు తెలిపారు.