కృష్ణా: విజయవాడ వజ్రా గ్రౌండ్స్‌లో ఈరోజు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ కటౌట్‌ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కటౌట్ పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరుకానున్నారు. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా రానున్నారు.