E.G: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. స్థానిక ఎఫ్సీఐ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం కేంద్రాన్ని ఆర్డీవో ఆర్ కృష్ణనాయక్తో కలిసి కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి ఈవీఎం భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు.