KDP: మైలవరం మండలం వద్దిరాల, దొడియం గ్రామాలలో 1200 ఎకరాల ప్రభుత్వ భూములను ఆదానీ కంపెనీకి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సోలార్ కార్పొరేషన్ ద్వారా ఈ భూములను ఆదానీ సోలార్ ఎనర్జీ కంపెనీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. 250MW సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు కేటాయించారు.