తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఆస్తులను అటాచ్ ఈడి అటాచ్ చేసింది. బస్సుల కొనుగోలు కేసులో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది.
PMLA కింద గతంలో కేసు నమోదు చేసిన ఈడీ జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి గోపాల్ రెడ్డి అండ్ కో చెందిన ఆస్తులు అటాచ్ చేశారు. బిఎస్3 వాహనాల కుంభకోణం కేసులో ఈ ఆస్తుల అటాచ్ మెంట్ జరిగిందని అంటున్నారు. బిఎస్3 వాహనాలకు నకిలీ ఇన్వాస్ లు సృష్టించి బిఎస్ 4గా మార్చినట్టు గుర్తించారు ఈడీ అధికారులు. నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్టు కూడా అధికారులు గుర్తించారు.
ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి సంస్థ మీద ఆరోపణలు వచ్చాయి. అశోక్ లేలాండ్ నుండి ఈ వాహనాలను స్క్రాప్ లో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వాడు కావాలని అలా చేయడంతో ప్రభుత్వ ఆధాయానికి భారీ నష్టం వాటిల్లిందని అంటూ ఈడీ అధికారులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఆస్తులను అటాచ్ చేసినట్టు తెలుస్తోంది.