ప్రకాశం: కంభం మండలం పెద్ద నల్ల కాలువ, నర్సిరెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మహమ్మద్ మాట్లాడుతూ.. వరి పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు దళారులకు తక్కువధరకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం వారి మద్దతు ధర క్వింటాకు రూ.2,389 వేల ప్రకారం కొనుగోలు చేస్తుందన్నారు.