CTR: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వెల్డింగ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య కోరారు. నగరి సీపీఐ కార్యాలయంలో వెల్డింగ్ వర్కర్స్ సర్వసభ్య సమావేశం యూనియన్ అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ రంగంలోని కార్మికులు కొంతకాలానికే అనారోగ్యం పాలవుతున్నట్టు ఆయన చెప్పారు.