KRNL: కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రైతు సాధికార సంస్థ- ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం, నవ సార్వత్రిక సూత్రాలు మరియు మహిళా సంఘాల సప్త సూత్రాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఇందులో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.