ప్రకాశం: సింగరాయకొండలో ప్రసిద్ధి గాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు రేపు మంగళవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం 7 గంటలకి స్వామి వారికి పంచామృతాభిషేకం తిరుప్పావడ సేవ జరుగుతుందని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకావాలన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరారు.