GNTR: ప్లాస్టిక్ పై ఉక్కుపాదం మోపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవీ శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో గుర్తుచేశారు. ప్లాస్టిక్ వినియోగం ఎక్కువై, వర్షం పడినప్పుడల్లా నగరంలో డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయన్నారు. క్లాత్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసినా నగరంలో ఇప్పటికీ ప్లాస్టిక్ క్యారీబ్యాగులు ఉండటం బాధాకరమని అన్నారు.