KRNL: కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ సబ్జెక్టు బోధించేందుకు ఫ్యాకల్టీ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30న జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. పీజీలో 50% మార్కులతో పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.