W.G: భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి మందిరంలో జరిగే 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సోమవారం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.