ATP: గుత్తి ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో గురువారం 4 మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ సమావేశం నిర్వహించారు. CDPO ఢిల్లీశ్వరి మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులకు అందవలసిన పౌష్టికాహారాన్ని సరైన సమయంలో అందించాలని సూచించారు. సమయపాలన పాటించాలని, పాఠశాలలోని బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.