Pawan Kalyan changes wives like he changes cars CM Jagan
CM Jagan : తాజాగా ఎన్నికల కోడ్ విడుదలైంది. రాజకీయ పార్టీలకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం లభించడంతో సీఎం జగన్ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన ‘సిద్ధం’ సభలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఇప్పుడు ‘మేమంతా సిద్ధం’ పేరుతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ నెల 27 నుంచి బస్సుయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర 27 నుంచి 21 రోజుల పాటు కొనసాగనుంది.
ఆ తర్వాత ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాలుగు సన్నాహక సమావేశాలకే రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. అలాంటిది ఇప్పుడు వరుసగా 25 బహిరంగ సభలు అంటే జగన్ వేవ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బస్సు యాత్ర కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు వైసీపీ నాయకులు.