NDL: బేతంచర్ల పట్టణంలో సీపీఐ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నాడు నిర్వహించారు. ఈనెల 31న డోన్ పట్టణంలో సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు రంగం నాయుడు తెలిపారు. శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొంటారని రంగం నాయుడు అన్నారు.