VZM : క్షయవ్యాధి నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 7న ప్రారంభించి, మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.బి.అర్.అంబేద్కర్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో సమావేశమయ్యారు.