W.G: అత్తిలి మండలం మంచిలి గ్రామంలో సోమవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించారు. అత్తిలి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శిరగాని నాగేశ్వరరావు, హైదరాబాదుకు చెందిన బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు.