CTR: అంబేద్కర్ ఆశయ సాధనకు కలిసికట్టుగా కృషి చేద్దామని అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ మండల అధ్యక్షుడు గిరి తెలిపారు. సదుంలో సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. పలువురిని కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు చెప్పారు. గౌరవ అధ్యక్షులుగా లోకనాథం, వెంకటస్వామి, గౌరవ సలహాదారులుగా చిన్న రెడ్డెప్ప, వెంకటరామయ్య, ఉపాధ్యక్షునిగా శరత్ కుమార్, కార్యదర్శిగా రామాంజులును నియమించారు.