KRNL: దామోదరం సంజీవయ్య (చెక్పోస్ట్)నుంచి నందికొట్కూరు రోడ్డు వైపు శ్రీ సాయి గార్డెన్స్ వరకు జాతీయ రహదారి విస్తరణకు ప్రజలు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య, నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్ర బాబు కోరారు. శనివారం చెక్పోస్ట్ సమీపంలోని సంతోష్ ఫంక్షన్ హాలులో రహదారి విస్తరణలో భూమి కోల్పోనున్న బాధితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.