TPT: శ్రీవారి అభిషేకం టికెట్ల పేరుతో ఖమ్మం వాసికి టోకరా వేశాడు ఓ ప్రబుద్దుడు. టీటీడీ ఉద్యోగినని చెప్పి, రెండు ఫేక్ మేసేజులు పంపిన దళారి రూ.లక్ష పదివేలు వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. క్రిష్ణ చైతన్య పేరుతో సూపరింటెండెంట్ హోదాతో టీటీడీ నకిలీ ఐడీ కార్డు సృష్టించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేస్తున్నారు.