CTR: కలెక్టర్ చామకూరి శ్రీధర్ గురువారం కలికిరి మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల అభివృద్ధి కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ఫైళ్లను పరిశీలించారు. అనంతరం కొత్తపల్లి లే అవుట్‌ని సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న గృహాలను పరిశీలించి, లబ్ధిదారులకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలన్నారు.