SKLM: శ్రీకాకుళంలో ఉన్న సంతోషిమాత అమ్మ వారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మూలవిరాట్‌కు సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, అలంకరణ సేవ, నీరాజనం, మంత్రపుష్పం, మంగళ హారతి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కే.సర్వేశ్వరరావు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రసాదాలు స్వీకరించారు.