VSP: ముంచంగిపుట్టు మండలంలో ప్రమాదం చోటుచేసుకొంది. బూసిపుట్ వైపు నుంచి ముంచంగిపుట్టు వస్తున్న బొలెరో కంటవరం సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ చకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారన్నారు. బొలెరో లోయలోకి దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. బొలెరోను మంగళవారం సాయంత్రం బయటకు తీశారు.