CTR: కుప్పం మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిరు వ్యాపారుడు వేలు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి చిరు వ్యాపారం సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో సోమవారం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. వేలు అనారోగ్యంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా చిరు వ్యాపారుల సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.