కోనసీమ: ప్రకృతి విపత్తు సమయాలలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రామచంద్రపురం ఆర్డీవో అఖిల, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యంలు పేర్కొన్నారు. రామచంద్రపురం మండలంలో పలు గ్రామాలలో తుఫాన్ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు ఆర్డీవో అఖిల, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యంలు శుక్రవారం బియ్యం, నిత్యాసర వస్తువులు పంపిణీ చేశారు.