»Anam Vivekananda Reddy Rs Laksh Jagan Is Lucky Number
Anam Vivekananda Reddy: రూ. లక్ష జగన్ లక్కీ నంబర్
సాక్షి టీవీ తనది కాదని సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. సాక్షి సంగతo తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Anam Vivekananda Reddy: సాక్షి టీవీ తనది కాదని సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. సాక్షి సంగతo తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ లక్కీ నంబర్ లక్ష అని ఆనం అన్నారు. ఆయన పెట్టిన కంపెనీలన్నీ రూ. లక్షతో మొదలు పెట్టినవే. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్ కూడా రూ. లక్ష పెట్టుబడితో పెట్టిందేనని తెలిపారు. ఇందులో రూ. 35వేలు విజయసాయిరెడ్డి, జె. జగన్మోహన్రెడ్డి రూ.30 వేలు, కామత్ అనే మరో వ్యక్తి రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని చెప్పారు.
మొదట విజయసాయిరెడ్డి సాక్షిలో డైరెక్టర్గా ఉన్నారని ఆనం తెలిపారు. ఆయన రాజీనామా చేయగానే జగన్ డైరెక్టర్ అయ్యారని.. ప్రస్తుతం ఆయన సతీమణి భారతీరెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ సంస్థకు డైరెక్టర్గా పని చేశారన్నారు. వీళ్లంతా డైరెక్టర్లుగా ఉంటే జగన్కు సంబంధం లేదా?అని ప్రశ్నించారు. లక్ష రూపాయల కంపెనీలు రూ. వేల కోట్లుగా మారాయి. వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయి. తనకేమీ సంబంధం లేనట్లు జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆనం మండిపడ్డారు.