వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల వైసీపీ నేత అలీ మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచే తాను పార్టీ తరపున పోటీ చేస్తానని చెప్పారు. అయితే అందకు కండీషన్స్ అప్లై అంటూ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికలలో పవన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అని గతంలోనే తెలిపాడు. కాగా మరోసారి అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు.
అయితే ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నా పెద్దగా రాజకీయ ప్రసంగాల జోలికి పోని అలీ మీడియా సలహాదారుగ నియామకం అయ్యాక ప్రతి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పొలిటికల్ ప్రసంగాలకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ 175 అవుటాఫ్ 175 స్థానాలను గెలచుకుకోవడం ఖాయమన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజాగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించాడు. ఈ తరుణంలో అలీ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కి ఏడు రాష్ట్రాల నుండి క్రీడాకారులను తీసుకువచ్చి రాజమండ్రిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అనితెలిపారు. ఈ గ్రౌండ్ లో కొన్ని వందల సినిమాలు షూటింగ్ జరిగాయన్నారు.రాబోయే ఎన్నికల్లో ఎక్కడినుండి పోటీచేస్తున్నారని అడుగగా మా నాయకుడు ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.