ELR: ఏలూరులోని పడమర వీధి గంగానమ్మ జాతరలో ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చిరంజీవి చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా స్థానిక థియేటర్ వద్ద అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వచ్చే సంక్రాంతికి మరో మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.