చిత్తూరు: పశువుల ఆరోగ్య సంరక్షణకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ వైద్య శిబిరాలలో పశువులకు చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు.