సత్యసాయి: ధర్మవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రోజువారీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.