GNTR: పొన్నూరులో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్వి రమణ దంపతులు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పొన్నూరు అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు రమణ దంపతులకు ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికారు. అలాగే పొన్నూరు పట్టణ టీడీపీ నాయకులు రమణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.