NLR: ఈ నెల 31న రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు బాజీ రానున్నట్లు ఉదయగిరి బీజేపీ నాయకుడు ముడమాల రమేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయగిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనను మెచ్చి నియోజకవర్గంలోని పలువురు పార్టీలోకి చేరనున్నట్లు తెలిపారు.